Vizag School Boy Death : విశాఖలో విషాదం... క్లాస్ రూమ్ లో కుప్పకూలి ఆరేళ్ల విద్యార్థి మృతి, టీచర్ పై ఆరోపణలు
భారతదేశం, ఆగస్టు 21 -- Vizag School Boy Death : విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. తరగతి గదిలో ఆరేళ్ల యుకేజీ విద్యార్థి అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయి మరణించాడు. గురువారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో ప్రకారం.. ఆ చిన్నారి తన హోమ్‌వర్క్ స్లేట్ పట్టుకుని టీచర్ టేబుల్ వద్ద వరుసలో నిలబడి ఉన్నాడు. హోమ్‌వర్క్ తనిఖీ చేస్తున్న సమయంలో బాధితుడు తీవ్ర భయాందోళనకు గురై ఏడుస్తూ కనిపిస్తున్నాడు. టీచర్ అతని యూనిఫామ్ పట్టుకుని సరిచేస్తుండగా ఆ బాలుడు చేతులు ఊపుతూ కనిపించాడు.
టీచర్ ముందు భయంగా వణికిపోయినట్లు ఉన్న బాలుడు.. క్షణకాలం నిశ్చేష్టంగా నిలబడినట్లు కనిపించగా.. ఒక్కసారిగా స్పృహతప్పి టీచర్ కాళ్లపై పడిపోయాడు. ఆ తర్వాత టీచర్ బాలుడిని తేరుకునేలా చేయడానికి ప్రయత్నించ. ఘటన గమనించిన పాఠశాల సిబ్బంది, ఇతరులు వెంటనే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.