భారతదేశం, ఆగస్టు 21 -- Vizag School Boy Death : విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. తరగతి గదిలో ఆరేళ్ల యుకేజీ విద్యార్థి అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయి మరణించాడు. గురువారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో ప్రకారం.. ఆ చిన్నారి తన హోమ్‌వర్క్ స్లేట్‌ పట్టుకుని టీచర్ టేబుల్ వద్ద వరుసలో నిలబడి ఉన్నాడు. హోమ్‌వర్క్ తనిఖీ చేస్తున్న సమయంలో బాధితుడు తీవ్ర భయాందోళనకు గురై ఏడుస్తూ కనిపిస్తున్నాడు. టీచర్ అతని యూనిఫామ్‌ పట్టుకుని సరిచేస్తుండగా ఆ బాలుడు చేతులు ఊపుతూ కనిపించాడు.

టీచర్ ముందు భయంగా వణికిపోయినట్లు ఉన్న బాలుడు.. క్షణకాలం నిశ్చేష్టంగా నిలబడినట్లు కనిపించగా.. ఒక్కసారిగా స్పృహతప్పి టీచర్ కాళ్లపై పడిపోయాడు. ఆ తర్వాత టీచర్ బాలుడిని తేరుకునేలా చేయడానికి ప్రయత్నించ. ఘటన గమనించిన పాఠశాల సిబ్బంది, ఇతరులు వెంటనే...