Vijayawada-Lingampalli Intercity Express : విజయవాడ-లింగంపల్లి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్కు పిడుగురాళ్లలో స్టాప్
భారతదేశం, ఆగస్టు 30 -- విజయవాడ-లింగంపల్లి మధ్య ప్రయాణించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఒక ముఖ్యమైన వార్తను అందించింది. విజయవాడ-లింగంపల్లి-విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్(రైలు నంబర్లు 12795/12796) రైలుకు పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లో ప్రయోగాత్మకంగా ఒక నిమిషం పాటు ఆగేందుకు అనుమతి ఇచ్చింది.
ఈ నూతన స్టాపేజ్ 2026 సెప్టెంబర్ 4వ తేదీ నుండి అమలులోకి రానుంది. ప్రాథమికంగా ఆరు నెలల కాలపరిమితికి గానూ ఈ ప్రయోగాత్మక స్టాపేజ్ను కేటాయించారు. ఆ తర్వాత పరిస్థితుల ఆధారంగా దీనిని కంటిన్యూ చేసే అవకాశం ఉంది.
రైలు నంబర్ 12795 (విజయవాడ - లింగంపల్లి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్) విజయవాడ నుంచి సాయంత్రం 05:30 గంటలకు బయలుదేరుతుంది. పిడుగురాళ్లకు రాత్రి 07:08కు వచ్చి 07:09 గంటలకు బయలుదేరుతుంది. మంగళగిరి, గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లిలో ఆగుతుంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.