భారతదేశం, ఆగస్టు 30 -- విజయవాడ-లింగంపల్లి మధ్య ప్రయాణించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఒక ముఖ్యమైన వార్తను అందించింది. విజయవాడ-లింగంపల్లి-విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్(రైలు నంబర్లు 12795/12796) రైలుకు పిడుగురాళ్ల రైల్వే స్టేషన్‌లో ప్రయోగాత్మకంగా ఒక నిమిషం పాటు ఆగేందుకు అనుమతి ఇచ్చింది.

ఈ నూతన స్టాపేజ్ 2026 సెప్టెంబర్ 4వ తేదీ నుండి అమలులోకి రానుంది. ప్రాథమికంగా ఆరు నెలల కాలపరిమితికి గానూ ఈ ప్రయోగాత్మక స్టాపేజ్‌ను కేటాయించారు. ఆ తర్వాత పరిస్థితుల ఆధారంగా దీనిని కంటిన్యూ చేసే అవకాశం ఉంది.

రైలు నంబర్ 12795 (విజయవాడ - లింగంపల్లి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్) విజయవాడ నుంచి సాయంత్రం 05:30 గంటలకు బయలుదేరుతుంది. పిడుగురాళ్లకు రాత్రి 07:08కు వచ్చి 07:09 గంటలకు బయలుదేరుతుంది. మంగళగిరి, గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లిలో ఆగుతుంద...