భారతదేశం, జూన్ 27 -- వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహారం నిధులు విడుదలయ్యాయి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో శనివారం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు.

వెలిగొండ ప్రాజెక్ట్ కారణంగా భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు రూ. 300 కోట్ల ఆర్ అండ్ ఆర్ (పునరావాసం - స్థిరనివాసం) నిధులను నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేశారు. ఈ నిర్ణయంతో మార్కాపురం జిల్లా పరిధిలోని 2,351 నిర్వాసిత కుటుంబాలకు నేరుగా ఆర్థిక లబ్ధి చేకూరనుంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లబ్ధిదారుల సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. "ఈ రోజు వెలిగొండ ప్రాజెక్ట్ కోసం సర్వస్వం త్యాగం చేసిన 2,351 నిర్వాసిత కుటుంబాల ఖాతాల్లోకి రూ. 300 కోట్లు జమ చేస్తున్నాం. కలనూతల, సుంకేసుల, చింతలముడిపి, కాటమరాజు ...