భారతదేశం, సెప్టెంబర్ 14 -- Tirumala Brahmotsavam 2026 : కలియుగ వైకుంఠమైన తిరుమల గిరులు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 15వ తేదీ నుంచి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ మహోత్సవాలకు శ్రీకారం చుడుతూ. వైఖానస ఆగమ సాంప్రదాయం ప్రకారం ఇవాళ (సెప్టెంబర్ 14) రాత్రి 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో అంకురార్పణ ఘట్టాన్ని అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.

ఆగమశాస్త్ర నియమాల ప్రకారం తిరుమల ఆలయంలోని యాగశాలలో ఈ క్రతువును జరుపుతారు. ఏదైనా వైదిక ఉత్సవం లేదా యజ్ఞం సఫలంగా జరగడానికి ముందు అంకురార్పణ చేయడం అనివార్యమైన ఆచారం. ఈ భూమండలమంతా పాడిపంటలతో, పశుపక్ష్యాదులతో సుభిక్షంగా, సస్యశ్యామలంగా వర్ధిల్లాలని స్వామివారిని వేడుకుంటూ నవధాన్యాలను మొలకెత్తించడమే ఈ అంకురార్పణ వెనుక ఉన్...