Tirumala : తిరుమలలో ఆగస్టు 30 నుంచి కారీరిష్టి యాగం, వరుణ జపం
భారతదేశం, ఆగస్టు 18 -- సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండి దేశం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల క్షేత్రంలో ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 3 వరకు ఐదు రోజుల పాటు 'కారీరిష్టి యాగం', 'వరుణ జపం', అలాగే 'పర్జన్య శాంతి హోమం' వేడుకగా నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో టీటీడీ ఈ విషయాలను వెల్లడించింది. తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం వేదికగా ఈ ప్రత్యేక వైదిక క్రతువులు జరగనున్నాయి. ఈ ఆధ్యాత్మిక యజ్ఞంలో భాగంగా సెప్టెంబర్ 3వ తేదీన 'మహా పూర్ణాహుతి' క్రతువును అత్యంత నిష్ఠతో నిర్వహించనున్నారు.
ఈ యాగంలో మొత్తం 32 మంది వేద, శ్రౌత, స్మార్త పండితులు పాల్గొని మంత్రోచ్ఛారణలతో హోమాలు జరుపుతారు. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ కుప్పా శివసుబ్రహ్మణ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.