భారతదేశం, సెప్టెంబర్ 25 -- The Paradise Climax Explained And OTT Release: 'దసరా' వంటి బ్లాక్ ‌బస్టర్ తర్వాత నాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ యాక్షన్ చిత్రం 'ది ప్యారడైజ్'. భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంటోంది.

భూస్వామ్య వ్యవస్థ, అణచివేతకు గురైన వర్గాల హక్కుల పోరాటం నేపథ్యంగా శ్రీకాంత్ ఓదెల ఈ ది ప్యారడైజ్ కథను మలిచారు. అయితే, ది ప్యారడైజ్ సినిమా ముగింపు ఘట్టంలో అసలు ఏం జరిగింది? ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అర్థం ఏంటి? అనే అంశాలపై సోషల్ మీడియాలో ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.

'ప్యారడైజ్' అనే ఊహాజనిత ప్రాంతంలో నివసించే 'సవారి' తెగకు చెందిన జడల్ (నాని) కథ ఇది. చట్టబద్ధమైన గుర్తింపు లేని ఆ తెగను సమాజం, ప్రభుత్వాలు నేరస్తులుగా,...