భారతదేశం, జూలై 13 -- తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET - June 2026) రాసిన అభ్యర్థులకు కీలక అప్‌డేట్. విద్యాశాఖ సోమవారం (జూలై 13న) మధ్యాహ్నం 2:30 గంటలకు టెట్ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనుంది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయం నుంచి ఈ ఫలితాలను ప్రకటించనున్నారు.

ఈ ఏడాది జూన్ 16 నుండి జూన్ 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్ విధానంలో టెట్ పరీక్షలను నిర్వహించారు. ఈ జూన్ సెషన్‌కు సంబంధించి మొత్తం 1,53,752 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ప్రాథమిక తరగతుల (1 నుండి 5 తరగతులు) బోధనకు ఉద్దేశించిన పేపర్-1 పరీక్షకు 50,113 మంది, ఉన్నత ప్రాథమిక తరగతుల (6 నుండి 8 తరగతులు) బోధనకు ఉద్దేశించిన పేపర్-2 పరీక్షకు 1,03,639 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు.

అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు...