భారతదేశం, మే 26 -- TG TET Mock Test 2026 : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET 2026 - జూన్) రాసే అభ్యర్థులకు విద్యాశాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. అభ్యర్థులు ఆన్‌లైన్ పరీక్షా విధానంపై అవగాహన పెంచుకోవడానికి, సమయ పాలన అలవర్చుకోవడానికి వీలుగా అధికారిక వెబ్‌సైట్‌లో మాక్ టెస్ట్ ఆప్షన్లను ప్రారంభించారు.

టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://tgtet.aptonline.in/ సందర్శించి ఈ మాక్ టెస్టులను రాయవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో ఎలాంటి తప్పులు చేయకుండా ప్రశాంతంగా పరీక్ష రాయడానికి ఈ మోడల్ టెస్టులు ఎంతగానో ఉపయోగపడతాయి.

"ఆన్‌లైన్ పరీక్షల పట్ల అభ్యర్థుల్లో ఉండే భయాన్ని పోగొట్టడానికి, సిలబస్‌పై పట్టు సాధించడానికి ఈ మాక్ టెస్టులు బాగా తోడ్పడతాయి" అని విద్యాశాఖ అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంత అభ్యర్థులు డిజిట...