భారతదేశం, సెప్టెంబర్ 2 -- TG TET Hall Ticket 2026 : తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TG TET) 2026 ఇన్‌-సర్వీస్ టీచర్స్ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను పాఠశాల విద్యాశాఖ అధికారికంగా విడుదల చేసింది. సెప్టెంబర్ 2, 2026న వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ అడ్మిట్ కార్డులను అర్హులైన అభ్యర్థులు డిపార్ట్‌మెంట్ అధికారిక పోర్టల్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో జరగనున్న ఈ టెట్ పరీక్షకు హాజరుకానున్నారు. పాఠశాల విద్యాశాఖ ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం ఇన్‌-సర్వీస్ టీచర్ల తెలంగాణ టెట్ ఆన్‌లైన్ పరీక్షలు సెప్టెంబర్ 7 నుండి సెప్టెంబర్ 11, 2026 వరకు నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రాల్లోకి ప్రవేశించడానికి హాల్ టికెట్ ప్రింట్‌అవుట్ తప్పనిసరి. చెల్లుబాటు అయ్యే అడ్మిట్ కార్డ్...