భారతదేశం, అక్టోబర్ 11 -- TG SET 2026 Answer Keys : 'తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష' (TG-SET-2026) ప్రాథమిక కీలను ఉస్మానియా విశ్వవిద్యాలయం విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో గత సెప్టెంబర్ 28, 29 మరియు 30 తేదీల్లో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన రెస్పాన్స్ షీట్లు, ప్రశ్నాపత్రాలు మరియు ప్రాథమిక కీలను అధికారిక వెబ్‌సైట్లలో పొందుపరిచారు.

పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్లను www.telanganaset.org వెబ్‌సైట్ల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ప్రాథమిక కీలలో ప్రచురించిన సమాధానాలపై ఏవైనా సందేహాలు లేదా అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించారు.

అక్టోబర్ 12, 2026 మధ్యాహ్నం 3:00 గంటల నుంచి అభ్యంతరాలను అధికారుల దృష్టికి ...