భారతదేశం, జూలై 5 -- Telangana Police Recruitment 2026 : పోలీస్ ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఈ మేరకు భారీ నోటిఫికేషన్ సిద్ధమైంది. పోలీస్ శాఖతో పాటు ఫైర్, జైళ్లు, ఎస్పీఎఫ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 7,437 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ (నేరుగా భర్తీ) ద్వారా భర్తీ చేసేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) కి ప్రభుత్వం అధికారికంగా అనుమతులు మంజూరు చేసింది. అయితే ఖాళీల వివరాలను TSLPRB ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అనుమతించిన పోస్టులకు సంబంధించి లోకల్ క్యాడర్ల వారీగా ఖాళీల విభజన, రోస్టర్ పాయింట్లు, విద్యార్హతలు మరియు వయోపరిమితి వంటి పూర్తి వివరాలను హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లేదా సంబంధిత శాఖల అధిపతుల ను...