భారతదేశం, సెప్టెంబర్ 30 -- Telangana MLC Elections 2026 : తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరించింది. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రెండు కీలక పట్టభద్రుల స్థానాలకు పోటీ చేసే తమ పార్టీ అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించింది. ఈ అభ్యర్థుల ఎంపికకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తుది ఆమోదం తెలిపారు.

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన అధికారిక ప్రకటనను ఢిల్లీలో విడుదల చేశారు. హైదరాబాద్ తో పాటు ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధితో పాటు ఉత్తర, దక్షిణ తెలంగాణ ప్రాంతాలను కవర్ చేసే ఈ రెండు పట్టభద్రుల నియోజకవర్గాలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉద్యోగుల ఓట్లే గెలుపోటములను శాసించే అవ...