భారతదేశం, జూన్ 21 -- రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న 'డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ' (DOST-2026) మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఈ విడతకు సంబంధించి కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి, అలాగే వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి కల్పించిన గడువు నేటితో పూర్తి కానుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులు.. లేదా మంచి కాలేజీల కోసం ఎదురుచూస్తున్న వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.

ఈ మూడో విడత కౌన్సెలింగ్‌కు సంబంధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా జూన్ 25వ తేదీన సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నిర్ణీత గడువులోగా సంబంధిత కాలేజీల్లో ఒరిజినల్ సర్టిఫికేట...