భారతదేశం, ఆగస్టు 22 -- TG CPGET 2026 Counseling Schedule : రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (TG CPGET - 2026) ర్యాంకుల ఆధారంగా ఎంఏ (MA), ఎంకాం (MCom), ఎంఎస్‌సీ (MSc)తో పాటు ఇతర పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో సీట్ల భర్తీకి సంబంధించి కౌన్సెలింగ్ షెడ్యూల్ అధికారికంగా ఖరారైంది. ఈ నెల 24వ తేదీ నుంచి తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించనున్నట్లు ప్రవేశాల కన్వీనర్ ఆచార్య ఐ.పాండురంగారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ పీజీ ప్రవేశ పరీక్షకు వేలాది మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో మొత్తం 42,526 మంది అభ్యర్థులు అర్హత సాధించి ఉత్తీర్ణులయ్యారు. ర్యాంకులు సాధించి...