భారతదేశం, జూలై 25 -- తెలంగాణ ప్రభుత్వం స్థానిక వ్యాపారులకు, చిన్న తరహా పరిశ్రమలకు ఊతమిచ్చేలా విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ESD) - మీసేవా ద్వారా. 'మెటా' (Meta) భాగస్వామ్యంతో రాష్ట్రంలోని మీసేవ కేంద్రాలను డిజిటల్ అడ్వర్టైజింగ్ హబ్‌లుగా మారుస్తూ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అత్యంత తక్కువ ఖర్చుతోనే డిజిటల్ మార్కెటింగ్ సేవలను సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం.

ఈ ప్రత్యేక చొరవలో భాగంగా క్యూర్ ఏరియాకు చెందిన 150 మందికి పైగా మీసేవా విలేజ్ లెవల్ ఆంత్రప్రెన్యూర్లకు హైదరాబాద్‌ వేదికగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మెటా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రకటనలను ఎలా తయారు చేయాలి..? వాటిని లక్ష్యిత వినియోగదారులకు ఏ విధంగా చేర్చాలి..? అనే విషయాలపై సమగ్ర శిక్షణ ఇచ్చారు.

ప...