భారతదేశం, నవంబర్ 15 -- Swara Bhaskar About Sexual Harassment: సమాజంలో జరిగే అన్యాయాలపై ఎప్పుడూ ముక్కుసూటిగా స్పందించే బాలీవుడ్ నటి స్వర భాస్కర్, తన సినీ ప్రయాణం ఆరంభంలో ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని తాజాగా వెలుగులోకి తెచ్చారు.

ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ముంబై చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న రోజుల్లో, ఓ దర్శకుడు తనను మానసికంగా వేధించాడని స్వర భాస్కర్ బయటపెట్టారు. 'ది ఫ్రీ ప్రెస్ జర్నల్'కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో 2011 నాటి ఆ చేదు జ్ఞాపకాలను స్వర గుర్తుచేసుకున్నారు.

2011లో 'తను వెడ్స్ మను' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న స్వర భాస్కర్ అప్పుడప్పుడే బాలీవుడ్‌లో అవకాశాల కోసం అడుగులు వేస్తున్నారు. ఆ సమయంలో మధ్యప్రదేశ్‌లోని పచ్‌మఢీలో ఓ సినిమా అవుట్‌డోర్ షూటింగ్ కోసం వెళ్లారు.

మొత్తం 56 రోజుల పాటు సాగే ఆ షెడ్యూల్ మొదలైన కొద్ది ...