భారతదేశం, అక్టోబర్ 19 -- Sunny Deol Suryaa Teaser Released: 'గదర్ 2' సునామీ తర్వాత బాలీవుడ్ మాస్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ మరో శక్తివంతమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇన్వెస్టిగేటివ్ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'సూర్యా: అంత్ సే ఆరంభ్ తక్'.

ఇటీవల విడుదల చేసిన మోషన్ పోస్టర్ తర్వాత మేకర్స్ సూర్యా టీజర్‌ను రిలీజ్ చేశారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్‌లో సన్నీ డియోల్ ఉద్వేగభరితమైన నటనతో ఆకట్టుకున్నారు.

కుటుంబంతో సంతోషంగా గడిపే ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ జీవితం కూతురి ఆకస్మిక మరణంతో ఒక్కసారిగా మారిపోతుంది. ఆ మరణం వెనుక ఉన్న రహస్యాలను శోధిస్తున్న కొద్దీ, దేశంలోని వైద్యవ్యవస్థలో దాగి ఉన్న దిగ్భ్రాంతికరమైన నిజాలు బయటపడతాయి.

"డాక్టర్ దేవుడితో సమానమని నమ్మి రోగి తన ప్రాణాలను వార...