భారతదేశం, ఆగస్టు 7 -- Onam Special Trains 2026 : సొంత ఊర్లకు, బంధువుల ఇళ్లకు వెళ్లే ప్రయాణికులతో పండుగ సమయాల్లో రైళ్లు కిక్కిరిసిపోతుంటాయి. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరుపుకునే ఓనమ్ పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీ సాధారణం కంటే ఊహించని రీతిలో పెరుగుతుంది.

ఈ నేపధ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వారి ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు భారతీయ రైల్వే భారీ ఏర్పాట్లు చేసింది. రాబోయే ఓనం పండుగ సీజన్ కోసం ఏకంగా 112 ప్రత్యేక రైలు ట్రిప్పులను నడపాలని నిర్ణయించింది. ఈ మొత్తం సర్వీసుల్లో దక్షిణ రైల్వే స్వయంగా 54 ప్రత్యేక సర్వీసులను నిర్వహిస్తుండగా. ఇతర రైల్వే జోన్లు మిగిలిన 58 సర్వీసులను నడపనున్నాయి.

రైల్వే శాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. ఈ ప్రత్యేక రైళ్లు ప్రధానంగా ఆగస్టు 14 నుంచి సెప్టెంబరు 6 మధ్య కాలంలో అందుబాటులో ...