భారతదేశం, అక్టోబర్ 3 -- Charlapalli Tiruvannamalai Special Trains : దసరా, దీపావళి పండుగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. భాగ్యనగరంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి తిరువణ్ణామలై (అరుణాచలం) క్షేత్రానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. చర్లపల్లి - తిరువణ్ణామలై స్టేషన్ల మధ్య మొత్తం 14 వారపు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.

ఈ ప్రత్యేక రైళ్లు ఇరువైపులా ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి. కాచిగూడ, షాద్‌నగర్, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూలు సిటీ, ధోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి స్టేషన్లలో ఈ రైళ్లకు స్టాపేజీలు కేటాయించారు.

ప్రయాణికుల అవసరాలకు అనుగు...