భారతదేశం, నవంబర్ 8 -- Singer Sonu Nigam Buys 44 Cr Flat: ప్రముఖ గాయకుడు సోను నిగమ్ ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో మరో భారీ కొనుగోలుతో వార్తల్లో నిలిచారు. ముంబైలోనే అత్యంత ఖరీదైన అందేరీ వెస్ట్ ప్రాంతంలో ఏకంగా రూ.44.30 కోట్లతో ఓ విలాసవంతమైన ఫ్లాట్‌ను సొంతం చేసుకున్నారు స్టార్ సింగర్ సోను నిగమ్.

రియల్ ఎస్టేట్ విశ్లేషణ సంస్థ 'లియాసెస్ ఫోరాస్' సేకరించిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం ఈ లావాదేవీ అక్టోబర్ 30న పూర్తయింది. ముంబై వినోద రంగానికి కేంద్రబిందువైన అందేరీ ప్రాంతంలో సెలబ్రిటీలు ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టడం వర్ధమాన వ్యాపార శైలిగా మారింది. ఈ క్రమంలోనే సోను నిగమ్ గత కొద్దికాలంగా వాణిజ్య, నివాస ప్రాపర్టీలను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తూ తన బిజినెస్ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తున్నారు.

అందేరీ వెస్ట్‌లోని జుహు-వెర్సోవా లింక్ రోడ్డులో ఉన్న ...