భారతదేశం, సెప్టెంబర్ 9 -- SIR Voter Verification : రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) ప్రక్రియలో భాగంగా చాలా మందికి నోటీసులు జారీ అయ్యాయి. అయితే అలాంటి ఓటర్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఈ వివరాలన్నింటినీ మంగళవారం నుంచి అధికారిక వెబ్‌సైట్ http://ceotelangana.nic.in లో ప్రచురించినట్లు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 92.87 లక్షల మంది ఓటర్లకు ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇందులో డేటా లోపాలు, ఇతర తేడాలు ఉన్న 'అనామలీస్‌' ఓటర్లు 60.50 లక్షల మంది కాగా, సమాచారం సరిగ్గా సరిపోలని.. 'అన్‌-మ్యాపింగ్‌' ఓటర్లు 32.36 లక్షల మంది ఉన్నారు.

ఇప్పటివరకు ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో కేవలం ముసాయిదా ఓటర్ల జాబితాను మాత్రమే అందుబాటులో ఉంచింది. ఆ జాబితాలో ఏ ఏ ఓటర్లకు నోటీసులు వచ్చాయ...