భారతదేశం, జూన్ 1 -- Singareni Internal Recruitment 2026 : సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు యాజమాన్యం తీపి కబురు అందించింది. ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) నాన్-ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పరిధిలోని పలు పారామెడికల్, టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సంస్థలో ఇప్పటికే పనిచేస్తూ.. నిర్దేశిత అర్హతలు కలిగి ఉన్న అంతర్గత అభ్యర్థులకు (Internal Candidates) మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.

అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవాలి. సంబంధిత హార్డ్ కాపీని సమర్పించాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ జూన్ 3 నుంచి ప్రారంభమవుతుంది.

ఆన్‌లైన్ దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత.. అభ్యర్థులు సదరు అప్లికేషన్ ప్రింటవుట్‌తో పాటు తమకు సంబంధించిన విద్యార్హతల...