భారతదేశం, జూన్ 5 -- Singareni Internal Recruitment 2026 : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్-ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులకి సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ - ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పరిధిలోని పలు పారామెడికల్, టెక్నికల్ పోస్టులను భర్తీ చేస్తారు. మొత్తం 50 ఖాళీలున్నాయి. సంస్థలో ఇప్పటికే పనిచేస్తూ.. నిర్దేశిత అర్హతలు కలిగి ఉన్న అంతర్గత అభ్యర్థులకు (Internal Candidates) మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవాలి. సంబంధిత హార్డ్ కాపీని సమర్పించాల్సి ఉంటుంది. జూన్ 16వ తేదీ సాయంత్రం 05:00 గంటల వరకు సమయం ఉంటుంది. అభ్యర్థులు http://www.scclmines.com/internal లింక్ ద్వారా ప్రాసెస్ పూర్తి...