భారతదేశం, నవంబర్ 11 -- Serial Actress OTT Entry: బుల్లితెరపై రెండు దశాబ్దాలుగా నటిగా గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ కనికా మహేశ్వరి ఇప్పుడు తన కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. 'దియా ఔర్ బాతీ హమ్' వంటి ప్రజాదరణ పొందిన ధారావాహికల ద్వారా ఇంటింటికీ చేరువైన ఈ సీనియర్ సీరియల్ నటి తాజాగా ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు.

గత ఆరు నెలలుగా మనసులో అనుకుంటున్న ఈ కల నెరవేరడం పట్ల కనికా మహేశ్వరి సంతోషం వ్యక్తం చేశారు. బుల్లితెర సీరియల్స్ చిత్రీకరణ శైలికి, ఓటీటీ సిరీస్‌ల మేకింగ్‌కు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ మార్పును సహజంగా స్వీకరిస్తున్నట్లు కనిక చెప్పారు.

"ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి రావడం లభించిన అద్భుతమైన అవకాశం. రోజువారీ సీరియళ్లతో పోలిస్తే ఇక్కడ సీన్లు చిత్రీకరించే విధానం చాలా వేరుగా ఉంటుంది. ఎలాంటి ముందస్తు అంచనాలు లేకుండా ఒక విద్యార్థిలా నే...