భారతదేశం, జూన్ 18 -- Save The Tigers Season 3 Review And Rating: తెలుగు ఓటీటీ ప్రపంచంలో సూపర్ హిట్ సిరీస్‌గా మంచి క్రేజ్ సంపాదించుకుంది సేవ్ ది టైగర్స్. ఈ సిరీస్ నుంచి వచ్చిన రెండు సీజన్స్ బాగా నవ్వించి జియో హాట్‌స్టార్ ఓటీటీలో మోస్ట్ వ్యూయెడ్ కేటగిరీలో టాప్ ప్లేస్ సంపాదించుకున్నాయి.

దీంతో మేకర్స్ ఈ సిరీస్ నుంచి మూడో సీజన్‌ను దింపారు. జియో హాట్‌స్టార్‌లో జూన్ 19 నుంచి అంటే మరికొన్ని గంటల్లో సేవ్ ది టైగర్స్ సీజన్ 3 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో ఇటీవలే సేవ్ ది టైగర్స్ ఓటీటీ ప్రీమియర్స్ వేశారు. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? వెబ్ సిరీస్‌కు హ్యాట్రిక్ దక్కిందా? వంటి విషయాలను నేటి సేవ్ ది టైగర్స్ 3 రివ్యూలో చూద్దాం.

గత సీజన్లలాగే ఈసారి కూడా రాహుల్ (అభినవ్ గోమఠం), గంటా రవి (ప్రియదర్శి), విక్రమ్ (చైతన్య కృష్ణ)ల చుట్టూనే కథ తిరుగుతుంది. కాకపోతే ...