భారతదేశం, అక్టోబర్ 25 -- Saif Ali Khan Home Intruder Case Nurse: ముంబైలోని విలాసవంతమైన బాంద్రా ప్రాంతంలోని బాలీవుడ్ స్టార్ జంట సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ నివాసంలోకి చొరబడి దాడి చేసిన ఉదంతం సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసు విచారణ ముంబై న్యాయస్థానంలో వేగవంతమైంది.

దాడికి పాల్పడిన నిందితుడిని బాధితురాలు, సైఫ్ చిన్న కుమారుడు జేహ్ సంరక్షకురాలైన 59 ఏళ్ల నర్స్ (ఆయా) కోర్టులో స్పష్టంగా గుర్తుపట్టింది. గత ఐదేళ్లుగా సైఫ్ కుటుంబం వద్ద పనిచేస్తున్న సదరు నర్సే ఈ కేసులో ప్రధాన ఫిర్యాదుదారు కావడం గమనార్హం. న్యాయమూర్తి సమక్షంలో ఆ అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘటనను ఆమె వివరించింది.

ఆ రాత్రి 2 గంటల సమయంలో బాత్రూమ్ లైట్ వెలుగుతుండటంతో కరీనా కపూర్ ఏమోనని భావించినట్లు ఆయా తెలిపింది. అయితే కొద్దిసేపటికే ఒక అపరిచిత వ...