భారతదేశం, ఆగస్టు 27 -- Telangana Ration Card eKYC : తెలంగాణలో రేషన్ బియ్యం పొందుతున్న కార్డుదారులకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అత్యంత ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్ సౌకర్యం నిరంతరం అందాలంటే లబ్ధిదారులు తప్పనిసరిగా ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఈ కేవైసీ పూర్తి చేయడానికి విధించిన గడువు అత్యంత సమీపంలోకి వచ్చింది. ఈ నెల 31వ తేదీ (ఆగస్టు 31) నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు ఈ గడువును పొడిగించినందున, ఈసారి గడువు లోగా పని పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.

రేషన్ పంపిణీ వ్యవస్థలో పూర్తిస్థాయి పారదర్శకతను తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ డ్రైవ్ నిర్వహిస్తోంది. అర్హులైన పేదలకే సంక్షేమ ఫలాలు అందాలని, అనర్హులు లేదా బోగస్ కార్డుదారులను...