భారతదేశం, అక్టోబర్ 16 -- Ranabaali Movie Review And Rating In Telugu: టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటకు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. గీత గోవిందం, డియర్ కామ్రెడ్ సినిమాలతో విజయ్, రష్మిక అలరించారు. అలాంటి ఈ జంట పెళ్లి తర్వాత కలిసి నటించిన మొదటి సినిమా రణబాలి.

'టాక్సీవాలా', 'శ్యామ్ సింగరాయ్' సినిమాల తర్వాత డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన సినిమానే ఈ రణబాలి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. విజయ్-రష్మిక, రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంతో రణబాలిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అలాంటి రణబాలి సినిమా ఇవాళ (అక్టోబర్ 16) థియేటర్లలో విడుదలైంది. బ్రిటిష్ పాలనా కాలంలో సాగే కథతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో నేటి రణబాలి రివ్యూలో తెలుసుకు...