భారతదేశం, అక్టోబర్ 25 -- Radhika Apte On Violence Trend Over Akka OTT Release: బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బోల్డ్ హీరోయిన్ రాధికా ఆప్టే. నందమూరి బాలకృష్ణ సరసన 'లెజెండ్', 'లయన్' చిత్రాలతో పాటు రామ్ గోపాల్ వర్మ 'రక్తచరిత్ర'లో మెరిసిన ఈ భామ, రొటీన్ ఫార్ములా సినిమాలకు ఎప్పుడూ దూరంగా ఉంటారు.

కెరీర్ ప్రారంభం నుంచి భిన్నమైన కథాంశాలను ఎంచుకుంటున్న ఈ హీరోయిన్ తాజాగా వెండితెరపై పెరుగుతున్న హింసపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాధికా ఆప్టే నటించిన నయా వెబ్ సిరీస్ అక్క ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ ఓటీటీ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన రాధిక ఆప్టే నేటి సినిమా ట్రెండ్‌ను తీవ్రంగా తప్పుపట్టారు.

"ప్రస్తుతం థియేటర్లలో ఏది వర్కవుట్ అవుతోందో చూస్తే అంతా విపరీతమైన హింసే కని...