భారతదేశం, జూన్ 17 -- దేశంలోని కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వ్యవసాయ పెట్టుబడి సహాయం కోసం ఎదురుచూస్తున్న అన్నదాతల ఖాతాల్లోకి పీఎం-కిసాన్ సమృద్ధి నిధులు చేరేందుకు ముహూర్తం ఖరారైంది. జూన్ 20వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎం-కిసాన్ (PM-Kisan Samman Nidhi) పథకం కింద 23వ విడత నిధులను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి విడుదల చేయనున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్‌లో జరగనున్న భారీ బహిరంగ సభ వేదికగా ప్రధాని ఈ నిధుల విడుదలకు శ్రీకారం చుట్టనున్నారు.

ఈ విడతలో అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి రూ. 2,000 చొప్పున డీబీటీ ద్వారా లబ్ధి చేకూరనుంది. కాగా, చిన్న, సన్నకారు రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని కింద ఏటా మూడు విడతల్లో...