భారతదేశం, జూలై 9 -- OTT Release Movies Today: థియేటర్లకు వెళ్లే ఓపిక లేనివారికీ, ఇంట్లోనే ప్రశాంతంగా కూర్చుని కొత్త సినిమాలు చూడాలనుకునేవారికీ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సరికొత్త వినోదాన్ని అందిస్తున్నాయి. ప్రతి వారంలాగే ఈ వారం కూడా ఓటీటీ ప్రియులను అలరించేందుకు విభిన్న జానర్లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్క్రీన్‌పైకి వచ్చేశాయి.

అయితే, ఇవాళ (జూలై 9) ఒక్కరోజు 5 ఇంట్రెస్టింగ్ సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, సన్ నెక్ట్స్ ఓటీటీల్లో రామ్ చరణ్ పెద్ది నుంచి శ్రద్ధా దాస్ హారర్ థ్రిల్లర్ త్రికాల వరకు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలపై లుక్కేద్దాం.

యూత్‌కు నచ్చే కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలు ఈ మధ్య కాలంలో బాగా ఆకట్టుకుంటున్నాయి. అదే కోవలో నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈరోజు నుంచి పెద్ది ఓటీటీ...