భారతదేశం, సెప్టెంబర్ 18 -- Telugu OTT Crime Thriller Panchanama Streaming Minutes: క్రైమ్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జోనర్లకు ఓటీటీ వేదికలపై ఉన్న క్రేజ్ వేరు. రేసింగ్ స్క్రీన్ ప్లే, థ్రిల్లింగ్ టేకింగ్ సరిగ్గా కుదిరితే చాలు, ప్రేక్షకులు ఓటీటీల్లో ఆ సిరీస్‌ను బింజ్ వాచ్ చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఈ వరుసలోనే ఓ తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలో దూసుకుపోతోంది. ఆ ఓటీటీ సిరీస్ పంచనామా.

మొత్తం ఆరు ఎపిసోడ్లతో రూపుదిద్దుకున్న పంచనామా మొదటి సీజన్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. నగరంలో వరుసగా జరిగే మూడు హత్యలు, ఆ కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగిన పోలీస్ బృందం, ఎంత వెతికినా ఒక్క చిన్న క్లూ కూడా దొరక్కపోవడం వంటి అంశాలతో కథ కథనాలు ఎంతో గ్రిప్పింగ్‌గా నడుస్తాయి.

ఆ హత్యల వెనుక దాగున్న అసలు సూత్రధారి ఎవరు?, దానికి గల కారణాలేం...