భారతదేశం, ఆగస్టు 25 -- Top 7 OTT Movies To Watch This Week: ఈ వారం ఓటీటీలోకి ఎన్నో రకాల సినిమాలు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. కానీ, వాటిలో ఈ వారం చూడాల్సిన టాప్ 7 ఇంట్రెస్టింగ్ సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఈటీవీ విన్, జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ఆహా, జీ5, సోనీ లివ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఓటీటీ రిలీజ్ కానున్న ఆ సినిమాలు ఏంటో చూద్దాం.

తెలుగులో క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా న్యూటన్స్ థర్డ్ లా. హీరోలు సుమంత్, జగపతి బాబు మెయిన్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమా ఓ క్రైమ్ చుట్టూ సాగుతుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన న్యూటన్స్ థర్డ్ లా ఈటీవీ విన్‌లో ఆగస్ట్ 27న ఓటీటీ రిలీజ్ కానుంది.

ఐ నోబడీ (తెలుగు డబ్బింగ్ మలయాళ హీస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా మూవీ): మలయాళ స్టార్‌ హీరో, వారణాసి విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ న...