భారతదేశం, సెప్టెంబర్ 28 -- Top 6 OTT Release Movies To Watch This Week: అక్టోబర్ ఆరంభంలోనే ఓటీటీ తెరపై వినోదాల పండుగ మొదలవుతోంది. ఇంట్లోనే కూర్చుని కొత్త సినిమాలు చూడాలనుకునే తెలుగు ప్రేక్షకులకు ఈసారి ఓటీటీల్లో వరుసగా డిఫరెంట్ జోనర్ సినిమాలు ముందుకు వస్తున్నాయి.

అయితే, వీటిలో ఈ వారం ఓటీటీలో చూడాల్సిన టాప్ 6 సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. రొమాంటిక్ కామెడీలు, మైండ్ బెండింగ్ క్రైమ్ థ్రిల్లర్లు, భయపెట్టే హారర్ కథల వరకు ప్రతి ఒక్కరి అభిరుచికి తగ్గట్టుగా విభిన్నమైన ఈ టాప్ 6 ఓటీటీ సినిమాలపై లుక్కేద్దాం.

'మేమ్ ఫేమస్' చిత్రంతో యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన సరికొత్త చిత్రం 'రోమాంచకం'. హైదరాబాద్‌లో స్టార్టప్ ప్రారంభించాలనుకునే ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అన్వేష్, చెన్నైకి చెందిన మైథిలి (అనంతిక సనీల్‌కుమ...