భారతదేశం, మార్చి 30 -- సినిమా థియేటర్లకు వెళ్లకపోయినా, ఇంట్లోనే కూర్చుని ప్రపంచ స్థాయి వినోదాన్ని ఆస్వాదించే ఓటీటీ ప్రియులకు ఈ వారం అదిరిపోయే అప్‌డేట్స్ వచ్చాయి. మార్చి 30 నుంచి ఏప్రిల్ 5 వరకు వివిధ ప్లాట్‌ఫామ్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో తెలుసుకుందాం.

అన్‌టోల్డ్- ది డెత్ అండ్ లైఫ్ ఆఫ్ లామర్ ఓడమ్ (మార్చి 31): ఎన్‌బీఏ స్టార్ లామర్ ఓడమ్ జీవితంలోని ఎత్తుపల్లాలు, ఖలో కర్దాషియాన్‌తో వివాహం, డ్రగ్స్ వల్ల మరణం అంచు దాకా వెళ్లిన భయంకర అనుభవాలను ఈ డాక్యుమెంటరీలో చూడవచ్చు.

హ్యాపీ పటేల్ - ఖతర్నాక్ జాసూస్ (ఏప్రిల్ 1): ప్రముఖ స్టాండప్ కమెడియన్ వీర్ దాస్ దర్శకత్వం వహించిన తొలి చిత్రమిది. ఒక అమాయకపు బ్రిటిష్ గూఢచారి గోవాలో ఒక మహిళను రక్షించే క్రమంలో చేసే హంగామా నవ్వులు పూయిస్తుంది. ఇందులో మిథిలా పాల్కర్, మోనా సింగ్ ప్రధ...