భారతదేశం, ఏప్రిల్ 6 -- ఓటీటీలోకి ఈ వారం (ఏప్రిల్ 6 నుంచి 13) 8 ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్ అవనున్నాయి. ఈ 8 ఒకే ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. అంతేకాకుండా వీటిలో అందరు ఇష్టపడే హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉండే సినిమాలు ఎక్కువగా 4 ఓటీటీ స్ట్రీమింగ్ అవనున్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.

యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఇంగ్లీష్ డాక్యుమెంటరీ చిత్రం బిలీవ్ మీ: ది ఫాల్స్ ప్రొఫెట్. ఒక సీక్రెట్ సొసైటీలోకి ప్రవేశించి దైవం పేరుతో మోసాలకు పాల్పడే నకిలీ బాబాల గుట్టును ఒక చిత్రనిర్మాత, కల్ట్ నిపుణుడు ఎలా రట్టు చేశారనేది ఇందులో ఆసక్తికరంగా చూపించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 8 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

ప్రేమ, ఆకర్షణ, మోసం.. ఈ మూడింటి కలయికతో సాగే పాపులర్ ఓటీటీ రియాలిటీ షో 'టెంప్టేషన్ ఐలాండ్' రెండో సీజన్ ఏప్రిల్ 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ల...