భారతదేశం, మే 11 -- OTT Releases This Week: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఈ వారం కూడా యాక్షన్, థ్రిల్లర్, డ్రామా వంటి విభిన్న జోనర్లతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాయి. ముఖ్యంగా వెండితెరపై వసూళ్ల సునామీ సృష్టించిన బ్లాక్ బస్టర్ల నుంచి ఉత్కంఠ రేపే థ్రిల్లర్ డాక్యుమెంటరీల వరకు ఓటీటీ సినిమాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఆ విశేషాలేంటో చూద్దాం.

థియేటర్లలో నెల రోజులకు పైగా సంచలనం సృష్టించిన 'ధురంధర్: ది రివెంజ్' ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం భారతీయ బాక్సాఫీస్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది.

ధురంధర్ 2 సినిమా రూ. 1700 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సారా అర్జున్ నటించిన ధురంధర్ 2 జియో హాట్‌స్టార్‌లో మే 15 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది....