భారతదేశం, నవంబర్ 15 -- Telugu Horror Thriller 418 OTT Release Official: టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో రూపొందిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ 418 ఓటీటీలోకి వచ్చేయనుంది. థియేటర్లలో విడుదలైన (అక్టోబర్ 23) కొద్ది రోజులకే ఈ 418 మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమవడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.

నిజానికి 418 సినిమా థియేటర్లలోకి రాకముందు భారీ హైప్ క్రియేట్ చేసింది. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు ఈ ప్రాజెక్ట్‌తో ముడిపడటం, సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసిందన్న వార్తలు రావడంతో ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. సినిమాలోని హారర్ సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయని చిత్రబృందం ప్రచారం చేయడంతో, హారర్ ప్రియులు ఈ చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూశారు.

భారీ అంచనాల మధ్య థియేటర్లలో అడుగుపెట్టిన '418' బాక్సాఫీస్ వద్ద ఆ...