భారతదేశం, సెప్టెంబర్ 25 -- Agadha OTT Release Today In 4 Languages: ఎప్పుడైనా సరే హారర్ థ్రిల్లర్స్‌కు ఉండే క్రేజ్ వేరు. రెగ్యులర్ ఫార్మాట్‌లోనే కథ ఉన్నప్పటికీ డిఫరెంట్‌గా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిస్తే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. అయితే, ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన మైండ్-బెండింగ్ డివోషనల్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'అగధ'.

థియేటర్లలో రిలీజై సస్పెన్స్, హారర్ ప్రేమికులను అలరించిన అగధ ఓటీటీలోకి ఇవాళ (సెప్టెంబర్ 25) స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి 7.5 రేటింగ్ వచ్చింది. మిస్టరీ,క్షుద్రపూజలు, రివేంజ్ వంటి ఎలిమెంట్స్‌తో అగధను తెరకెక్కించారు.

ఆధ్యాత్మిక శక్తులున్న మహదేవి (కామాక్షి భాస్కర్ల) అనే యంగ్ ఉమెన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఊరిలో వరుసగా జరిగే వింత మరణ...