భారతదేశం, అక్టోబర్ 31 -- OTT Release Movies And Web Series New: డిజిటల్ వినోద ప్రపంచంలో ఈ వారం సరికొత్త చిత్రాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేస్తున్నాయి. హారర్ మిస్టరీల నుంచి హృదయానికి హత్తుకునే ప్రేమకథల వరకు విభిన్న జోనర్లలో రూపొందిన 8 చిత్రాలు గురువారం (అక్టోబర్ 29) ఒక్కరోజు ఓటీటీల్లో అడుగుపెట్టాయి. ఈ వీకెండ్ ప్లాన్స్‌ను మరింత ఇంట్రెస్టింగ్‌గా మార్చేందుకు వచ్చిన ఈ థర్స్‌డే థండర్ సినిమాల గురించి తెలుసుకుందాం.

2000వ సంవత్సరం నాటి గ్రామీణ భారతదేశం నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన తెలుగు టీనేజ్ ప్రేమకథ 'తెల్లకాగితం'. బడికెళ్లే వయసులో పురివిప్పిన తొలి ప్రేమ తీపి జ్ఞాపకాలు, అనుకోకుండా జరిగే ఒక చిన్న పొరపాటు వల్ల ఆ ఇద్దరి జీవితాలు ఎలా మారాయనేది ఈ చిత్ర కథాంశం. తెల్లటి కాగితంపై పడిన ఎర్రటి సిరా చుక్కలా వారి బంధంలో తలెత్తిన సవాళ్లను ప్రేమికులు ఎలా ఎదుర్కొన్...