భారతదేశం, మే 10 -- Oh Butterfly OTT Release Details: ప్రస్తుతం వెండితెరపై థ్రిల్లర్ సినిమాల హవా నడుస్తోంది. అందులోనూ మనిషిలోని మానసిక సంఘర్షణలను, రహస్యాలను ఇతివృత్తంగా తీసుకుని వచ్చే 'సైకలాజికల్ థ్రిల్లర్స్'కు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ సైకలాజికల్ థ్రిల్లర్‌కు రొమాంటిక్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే.. ఆ కోవకే చెందుతుంది 'ఓ బటర్‌ఫ్లై' మూవీ.

ఇటీవలే కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన ఓ బటర్‌‌ఫ్లై సినిమాకు డైరెక్టర్ విజయ్ రంగనాథన్ కథ, దర్శకత్వం వహించారు. ఒక విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకులను థియేటర్లలో అలరించింది ఈ సినిమా. రీసెంట్‌గా థియేట్రికల్ రన్‌ను ముగించుకుని ఓ బటర్‌‌ఫ్లై ఓటీటీలోకి వచ్చేసింది.

ఓ బటర్‌‌ఫ్లై సినిమాలో గౌరీ (నివేదితా సతీష్) అనే యువతి పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. గౌరీకి అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (OCD) ఉంటుంది. తన గతం గు...