భారతదేశం, నవంబర్ 1 -- Varam D/O Bhargavi OTT Streaming Today: డిజిటల్ మీడియా రంగంలో వైవిధ్యమైన కథలతో ఆకట్టుకుంటున్న ఈటీవీ విన్ ప్లాట్‌ఫామ్ మరో ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాతో ఇవాళ (నవంబర్ 1) ముందుకు వచ్చింది. ఈటీవీ విన్ కథా సుధలో భాగంగా నేడు ఓటీటీ రిలీజ్ అయిన తెలుగు సినిమా 'వరం D/o భార్గవి'

చిన్న పిల్లల అమాయకత్వం, వారి సరదాలు, దానికి వెనుకున్న ఆర్థిక పరిస్థితులను ఎంతో సహజంగా తెరకెక్కించిన వరం డాటర్ ఆఫ్ భార్గవి ఓటీటీలో నేటి నుంచి సందడి చేస్తోంది.

వరం అనే ఒక చిన్నారి చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. రోజువారీ సరదాల కోసం తన స్నేహితుడితో కలిసి రైలు పెట్టెల నుంచి బొగ్గును దొంగిలించడం ఆ పాపకు అలవాటు. ఆ తెచ్చిన బొగ్గును కొనుగోలు చేశానని ఇంట్లో తల్లి భార్గవిని నమ్మిస్తుంది.

దొంగిలించిన బొగ్గు అమ్మగా వచ్చిన డబ్బులతో ప్రతిరోజూ ఐస్‌క్రీమ్ తింటూ హాయిగా గడ...