భారతదేశం, ఏప్రిల్ 25 -- NMDC Hyderabad Recruitment 2026 : హైదరాబాద్‌లోని నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ అయింది. తాత్కాలిక ప్రాతిపదికన వివిధ మైనింగ్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న 59 ఉద్యోగాలను రిక్రూట్ చేస్తారు.

ఈ పోస్టులకు అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మే 6వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. మొత్తం 59 పోస్టులు ఉండగా.. వీటిలో ఓపెన్ కేటగిరీలో (UR) 27, ఓబీసీ - 15, ఎస్సీ (SC) - 8, ఎస్టీ- 4, EWS కోటా కింద 5 పోస్టులను కేటాయించారు.

జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. 250 దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ మరియు మాజీ సైనికోద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. అభ్యర్థులు వారి ఫోటో, సంతకం, పదో తరగతి సర్టిఫికేట్, విద్యార్హత మరియు కుల ధ్రువ...