భారతదేశం, సెప్టెంబర్ 22 -- Director And Producer On Rashmika Mandanna In Mysaa Teaser Launch: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన కెరీర్‌లో ప్రతిష్టాత్మక పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'మైసా'లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో గోండ్ గిరిజన మహిళ పాత్ర పోషిస్తున్న రష్మిక , ఆ పాత్రలో ఒదిగిపొవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు.

రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న'మైసా' ఆకట్టుకునే ఫస్ట్ గ్లింప్స్‌తో ఇప్పటికే ఆసక్తిని రేకెత్తించింది. నవంబర్ 27, 2026న 'మైసా' ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఇటీవల మేకర్స్ మైసా టీజర్ లాంచ్ చేశారు. మైసా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ రవీంద్ర పుల్లె, నిర్మాత అజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

డైరెక్టర్ రవీంద్ర మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈ కథ రాస్తున్నప్పుడే రష్మిక గార...