భారతదేశం, సెప్టెంబర్ 27 -- Mani Ratnam Praised Keerthy Suresh Bold Movie Dorothy: తమిళ డారెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త చిత్రం 'డోరతి' థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేసిన ఈ సినిమా ఇద్దరు మిత్రులు, ఒక యువతి చుట్టూ తిరిగే సాధారణ ప్రేమకథగా భావించిన ప్రేక్షకులకు.. ఇందులో ఎల్జీబీటీక్యూఐఏ+ (LGBTQIA+) కోణాన్ని స్పృశించడం ఊహించని చర్చకు దారితీసింది.

స్వదేశంలో ఈ కథాంశంపై కొంత ప్రతికూల స్పందన వ్యక్తమవుతుండగా, కెనడా వేదికగా జరిగిన గ్లోబల్ ప్రిమియర్‌లో అద్భుత టాక్ సొంతం చేసుకుంది డోరతి సినిమా. ఈ క్రమంలో భారతీయ సినిమా దిగ్గజ దర్శకుడు మణిరత్నం డోరతి చిత్రంపై ప్రత్యేకంగా స్పందిస్తూ చిత్ర బృందాన్ని ఆకాశానికెత్తేశారు.

నిర్మాతలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (ట్వి...