భారతదేశం, ఆగస్టు 14 -- గృహావసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్లకు ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తిచేయాలని చమురు సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే విషయంపై గడువును కూడా విధించాయి. ఈనెల 16వ తేదీలోపు గ్యాస్ వినియోగదారులు తప్పనిసరిగా ఈకేవైసీని పూర్తి చేసుకోవాలని చెబుతున్నాయి. అయితే ఈ గడువు కూడా దగ్గరపడుతోంది. ఇప్పటివరకు ఈ ప్రాసెస్ పూర్తి చేయని వినియోగదారులు. వెంటనే ఈకేవైసీ చేయించుకోవాలని ఆయా కంపెనీలు సూచిస్తున్నాయి.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్ ఏజెన్సీల కార్యాలయాల వద్ద, గ్యాస్ డెలివరీ బాయ్స్ వద్ద బయోమెట్రిక్ నమోదు చేయించుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. నిజానికి ఈ-కేవైసీ పూర్తి చేయడానికి గడిచిన జూలై నెలలోనే గడువు ముగియాల్సి ఉంది. అయితే వినియోగదారుల అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని చమురు కంపెనీలు ఈ అవకాశాన్ని ఈ నెల 16 వరకు పొడిగించా...