భారతదేశం, సెప్టెంబర్ 11 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో దక్షిణామూర్తి క్షమాపణ చెప్పాలని అడిగింది, జరిగిన గొడవ గురించి జ్యోత్స్నకు చెబుతాడు శివ నారాయణ. అంతలో సూరజ్ ఇంటికి వస్తాడు. శివ నారాయణతో ఆవేశంతో ఊగిపోతాడు.

మీతో మాట్లాడదామని వచ్చానని తాత అని సూరజ్ అంటే.. ఎవడ్రా నీకు తాత.. తూ.. మీరసలు మనుషులేనట్రా.. అందరూ పగలు పెట్టుకుని జీవితాలను నాశనం చేస్తారా.. ఏం బతుకులురా మీవి.. అని శివ నారాయణ అంటాడు. అదే మాట నేను అంటే అని సూరజ్ అంటుండగా.. రేయ్ సూరజ్.. దశరథ లోపలికి వెళ్లి రివాల్వర్ తీసుకురా.. మాటలతో చెబితే వీడికి అర్థం కాదు అని శివ నారాయణ ఉగ్రరూపం చూపిస్తాడు.

వీడు మూర్ఖుడురా.. తండ్రి ఆదేశిస్తే తల్లి తల నరికిన ఒక రాజు కథ నాకు తెలుసు. కానీ, వీడు తల్లి ఆదేశిస్తే ఎవడి తలైన నరుకుతాడు అని శివ నారాయణ అంటాడు. మ...