భారతదేశం, మే 7 -- ఈ వేసవిలో చల్లని ప్రదేశానికి వెళ్లాలి అనుకుంటున్నారా? అయితే కర్ణాటకలోని కూర్గ్ మిమ్మల్ని పిలుస్తోంది. అంతేకాదు పక్కనే ఉన్న మైసూర్‌ కూడా వెళ్లి రావొచ్చు. మిడిల్ క్లాస్ బడ్జెట్ ధరలో ఈ టూర్‌ను ఐఆర్‌సీటీసీ ఆపరేట్ చేస్తోంది. మే 13వ తేదీన టూర్ ప్రారంభం అవుతుంది. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రతీ బుధవారం ఈ టూర్ ఉంటుంది.

కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి 19:05 గంటలకు రైలు నెం. 12785 (కాచిగూడ-మైసూరు ఎక్స్‌ప్రెస్)లో బయలుదేరుతారు. రాత్రి ప్రయాణం చేస్తారు.

ఉదయం 09:30 గంటలకు మైసూరు చేరుకుంటారు. కూర్గ్‌కు ప్రయాణం (115 కి.మీ.) చేస్తారు. మధ్యాహ్నానికి కూర్గ్ చేరుకుంటారు. ఆ తర్వాత హోటల్‌లో చెక్-ఇన్ చేస్తారు. అబ్బే జలపాతం, ఓంకారేశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రి కూర్గ్‌లోనే బస చేస్తారు.

హోటల్‌లో అల్పాహారం చేస్తారు. తలకావేరి, భా...